బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఎలాగైనా కెప్టెన్‌గా నిలవాలని వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ పోటీపడుతున్నారు. అయితే కెప్టెన్ అవ్వాలంటే దానికి ఇంటిసభ్యుల మద్దతు తప్పనిసరి అని చెప్పాడు బిగ్‌బాస్. కానీ తనకెవరూ సపోర్ట్ చేయడం లేదని, గేమ్‌లో కార్నర్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది వాసంతి.
తన స్నేహితులైన రేవంత్, శ్రీసత్యలు ఇద్దరూ తమకు ఓటేయమని నిల్చోగా.. శ్రీహాన్ శ్రీసత్యకు మద్దతు పలికాడు. ఏదో చిన్న కారణంతో తనకు సపోర్ట్ చేయలేదని గీతూ, బాలాదిత్యల మీద ఫైర్ అయింది శ్రీసత్య. చాలా చిన్న విషయం తీసుకువచ్చి నన్ను కెప్టెన్సీ కంటెండర్‌గా తీసేయడం సిల్లీగా ఉందని మండిపడింది. ఇక రోహిత్, సూర్య.. ఇద్దరిలో సూర్యకు సపోర్ట్ చేసింది మెరీనా. ఆఖరికి తన భార్య కూడా తనకు సపోర్ట్ చేయకపోవడంతో అవాక్కయ్యాడు రోహిత్.
చదవండి: ఇంత ద్వేషమా? అతడు సూసైడ్ చేసుకుంటాడు: నటి
ఒకే హోటల్‌లో సారా, శుభ్‌మన్ గిల్, వీడియో చూశారా?
Comments
Please login to add a commentAdd a comment