
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం రేవంత్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. హౌస్‌లో తను బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటానన్న రేవంత్ ఆ మాట నిలబెట్టుకునేట్లు కనిపించడం లేదు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తున్న సమయంలో ఇంటి నియమాలు ఎవరు పాటించకపోయినా బ్యాటరీ తగ్గుతుందని బిగ్‌బాస్ నొక్కి మరీ చెప్పాడు. అందరూ బిగ్‌బాస్ నియమాలు సరిగ్గా పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రేవంతే ఆదమరిచి నిద్రపోయి రెండుసార్లు బ్యాటరీ తగ్గేందుకు కారణమయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్‌లో గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టాస్క్ చివర్లో రాజ్ మొత్తం బ్యాటరీని వాడుకోవడంతో మెరీనా-రోహిత్‌లకు తమ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్ అందకుండా పోయినట్లు తెలుస్తోంది..
కాగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హౌస్‌మేట్స్‌కు గాయాలైనట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా బంతిని దక్కించుకునే క్రమంలో ఇంటిసభ్యులు గాయపడినట్లున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆది, వాసంతి, సూర్య, అర్జున్, రోహిత్, రేవంత్, సత్య, రాజ్ కెప్టెన్సీకోసం పోటీపడనున్నారట. మరి వీరిలో ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారో చూడాలి!
చదవండి: త్యాగానికి సిద్ధమైన రోహిత్, వాసంతి బతికిపోయిందిగా!
సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచి..: నటి
Comments
Please login to add a commentAdd a comment