![తమన్నాకు మరో బంపర్ ఆఫర్! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61457733570_625x300_0.jpg.webp?itok=stm0Cy6n)
తమన్నాకు మరో బంపర్ ఆఫర్!
ముంబై: బాహుబలి సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మిల్క్బ్యూటీ తమన్నా భాటియాకు మరో బంపర్ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ సినిమా బాజీరావ్ మస్తానీ ఘన విజయంతో జోరుమీదున్న రణ్వీర్ సింగ్ కు జోడీగా తమన్నా నటించనున్నట్టు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దిల్ వాలే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రణవీర్, రోహిత్ కలిసి నిర్మించనున్నారని సమాచారం. దీనిపై దిల్ వాలే డెరెక్టర్ ను ప్రశ్నించగా వేచి ఉండండి. కాలమే సమాధానం చెబుతుందని బదులిచ్చాడు.