స్త్రీలను గౌరవించాలి | Respect women | Sakshi
Sakshi News home page

స్త్రీలను గౌరవించాలి

Published Tue, Aug 9 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

స్త్రీలను గౌరవించాలి

స్త్రీలను గౌరవించాలి

 చరణ్ నాయుడు, షాలు, రోహిత్, శ్రావణి, కరుణాకరన్, విక్టోరియా ప్రధాన తారలుగా పాల్వాయి సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అరణ్యంలో’. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేశారు. పాల్వాయి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ -‘‘నాగరికత అంటే మనుషుల దుస్తుల్లో మార్పు రావడం కాదు, ఎల్లప్పుడూ మహిళలను గౌరవించాలనే కథాంశంతో తీసిన చిత్రమిది.

సందేశంతో పాటు వాణిజ్య హంగులతో కూడిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే కథ, కథనం ఉంటాయి. అజయ్ పట్నాయక్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. విడుదల తర్వాత ‘అరణ్యం 2’ తీస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement