Shalu
-
ట్రాప్లో పడతారు
మహేందర్ ఇప్పలపల్లి హీరోగా, షాలు, కాత్యాయనీ శర్మ హీరోయిన్లుగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ట్రాప్’. ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వీఎస్ ఫణింద్ర మాట్లాడుతూ–‘‘లవ్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. ఈ చిత్ర కథ చెప్పగానే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న ఆళ్ల స్వర్ణలతగారికి థ్యాంక్స్. ‘సింధూరం’ సినిమా బ్రహ్మాజీగారికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో ‘ట్రాప్’ చిత్రం నాకు అంత మంచిపేరు తీసుకువస్తుందని నమ్ముతున్నాను’’అన్నారు. ‘‘నిర్మాణ రంగంలోకి రావాలంటే తొలుత చాలా భయం వేసింది. కానీ, హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణులందరూ మంచి సహకారం అందించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రం అన్ని కార్యక్రమాలను ఫణీంద్ర దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు ఆళ్ల స్వర్ణలత. రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె, శివ, సంగీతం: ఈశ్వర్ పెరావలి, నేపథ్య సంగీతం: హర్ష ప్రవీణ్. -
స్త్రీలను గౌరవించాలి
చరణ్ నాయుడు, షాలు, రోహిత్, శ్రావణి, కరుణాకరన్, విక్టోరియా ప్రధాన తారలుగా పాల్వాయి సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అరణ్యంలో’. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేశారు. పాల్వాయి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ -‘‘నాగరికత అంటే మనుషుల దుస్తుల్లో మార్పు రావడం కాదు, ఎల్లప్పుడూ మహిళలను గౌరవించాలనే కథాంశంతో తీసిన చిత్రమిది. సందేశంతో పాటు వాణిజ్య హంగులతో కూడిన సస్పెన్స్ ఎంటర్టైనర్. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే కథ, కథనం ఉంటాయి. అజయ్ పట్నాయక్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. విడుదల తర్వాత ‘అరణ్యం 2’ తీస్తాం’’ అన్నారు. -
శైలు కథేంటి...?
కిరణ్, షాలు, రిచా ముఖ్యతారలుగా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మరపట్ల కళాధర్ చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ శైలు’. సందీప్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా కృతజ్ఞతలు. బీవీవీ చౌదరి కీలక పాత్ర పోషించారు’’ అని చెప్పారు. ఈ నెలలో పాటలను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కిషన్ కవాడియా, సహ నిర్మాతలు: కిషన్ కొసరాజు.