నేపాలీ కుర్రాడు... సచిన్‌ రికార్డును సవరించాడు  | Nepal Rohit Paudel breaks Sachin Tendulkar record with international fifty | Sakshi
Sakshi News home page

నేపాలీ కుర్రాడు... సచిన్‌ రికార్డును సవరించాడు 

Published Sun, Jan 27 2019 1:44 AM | Last Updated on Sun, Jan 27 2019 9:05 AM

Nepal Rohit Paudel breaks Sachin Tendulkar record with international fifty - Sakshi

దుబాయ్‌: నేపాల్‌ టీనేజ్‌ క్రికెటర్‌ రోహిత్‌ పౌడెల్‌ బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 29 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏళ్ల 146 రోజుల వయసున్న రోహిత్‌ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు.

దీంతో సచిన్‌ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాక్‌పై టెస్టు క్రికెట్‌లో చేసిన ఫిఫ్టీ తెరమరుగైంది. ఒక విధంగా వన్డే క్రికెట్లో ఆఫ్రిది (పాకిస్తాన్‌) రికార్డును కూడా రోహిత్‌ చెరిపేశాడు. ఆఫ్రిది 16 ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇవన్నీ కూడా పురుషుల క్రికెట్‌కే పరిమితం. ఎందుకంటే మహిళల క్రికెట్‌లో జొమరి లాగ్టెన్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా) 14 ఏళ్ల వయసులోనే టెస్టు, వన్డేల్లో అర్ధసెంచరీలు చేసిన అతిపిన్న క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement