Bigg Boss 6 Telugu Launch Updates: Marina And Rohit Entered As BB6 10th And 11th Contestants - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu Contestants: జంటగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ అండ్‌ మెరీనా

Published Sun, Sep 4 2022 8:01 PM | Last Updated on Sun, Sep 4 2022 8:39 PM

Bigg Boss 6 Telugu: Marina And Rohit Entered As Tenth Contestant - Sakshi

Marina And Rohit In Bigg Boss6 Telugu: మెరీనా పూర్తిపేరు మెరీనా అబ్రహం.‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్‌ అయిన మెరీనా ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల'సీరియల్‌లో నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది. మరోవైపు మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన రోహిత్‌ 'నీలికలువలు','అభిలాష','కంటే కూతుర్నే కనాలి' వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయ్యాడు.

షూటింగ్‌ సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో వరుణ్‌ అండ్‌ వితికా షెరులు జోడీగా హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హజ్బెండ్‌ అండ్‌ వైఫ్‌గా రోహిత్‌-మెరీనాలు ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ జోడీ ప్రేక్షకుల మనసుల్ని ఎంతవరకు గెలుచుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement