మిర్పూర్: మార్చిలో జరిగే టి20 ప్రపంచకప్ ద్వారా భారత క్రికెటర్లు ధోని, రోహిత్, యువరాజ్ అరుదైన ఘనత సాధించబోతున్నారు. వరుసగా ఆరోసారి ఈమెగా టోర్నీలో వీరు బరిలోకి దిగబోతున్నారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే వారితో పాటు ఓవరాల్‌గా అన్ని జట్ల నుంచి 19 మంది ఆటగాళ్లున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఏకంగా ఐదుగురు (మొర్తజా, షకీబ్, తమీమ్, మహ్ముదుల్లా, ముష్ఫీకర్) ఉండగా.. మిగతా జట్లలో డ్వేన్ బ్రేవో, గేల్, రామ్‌దిన్ (విండీస్); నాథన్ మెకల్లమ్, టేలర్ (కివీస్); డి విలియర్స్, డుమిని (దక్షిణాఫ్రికా); దిల్షాన్, మలింగ (శ్రీలంక); ఆఫ్రిది (పాక్), వాట్సన్ (ఆసీస్) ఉన్నారు.
ఇక మహిళల క్రికెట్ నుంచి 29 మంది వరుసగా ఐదో సారి ప్రపంచకప్ ఆడబోతున్నారు. వీరిలో భారత్ నుంచి కెప్టెన్ మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఉన్నారు. పాక్ నుంచి ఐదుగురు ఉండడం విశేషం.
ఆ ముగ్గురూ ఆరోసారి
Published Wed, Feb 24 2016 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement
Advertisement