బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్ల జోరు ముందు.. భారత బ్యాటర్లు చేతులేత్తేశారు.
బ్లాక్ క్యాప్స్ బౌలర్ల దాటికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లో అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. ఇక ఈ మ్యాచ్‌లో కుప్పకూలిన టీమిండియా పలు చెత్త రికార్డులను తమ పేరిట లిఖించుకుంది.
➔92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.
➔ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్.
Comments
Please login to add a commentAdd a comment