టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌పై తన మనోగతాన్ని వెల్లడించాడు. టెస్ట్‌ల్లో ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. స్పోర్ట్‌స్టార్‌తోమాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యత అని అన్నాడు. టీ20ల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన స్కై.. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. చిన్నతనం నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతూనే పెరిగానని గుర్తు చేసుకున్న స్కై.. ఆ వయసు నుంచే టెస్ట్ క్రికెట్‌పై మక్కువ ఎక్కువగా ఉండేదని అన్నాడు.
భారత టెస్ట్ జట్టులో స్థానం కోసం చాలామంది అహర్నిశలు శ్రమించారని అన్న స్కై.. తాను కూడా టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడుతున్నానని తెలిపాడు. యువ క్రికెటర్లకు టెస్ట్ జట్టులో స్థానంపై స్కై స్పందిస్తూ.. అర్హులైన వారందరికీ సరైన అవకాశాలు లభించాయని అన్నాడు.
కాగా, సూర్యకుమార్ గతేడాది టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ ఆడిన అనంతరం అతను గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అతని స్థానాన్ని ఆక్రమించాడు. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని స్కై సద్వినియోగం చేసుకోలేకపోయాడు. స్కై టెస్ట్‌ల్లో తన ఏకైక ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
త్వరలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో స్కై టెస్ట్ జట్టులో చోటు ఆశిస్తున్నాడు. మిడిలార్డర్‌లో స్కై.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వారి నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కై.. త్వరలో జరుగనున్న దేశవాలీ మ్యాచ్‌ల్లో రాణిస్తే టెస్ట్ జట్టు తలుపులు తట్టే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా మిడిలార్డర్‌లో పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి స్కై అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment