Shubman Gill: నీవు మరి మారవా గిల్‌..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! అతడిని తీసుకోండి? | Shubman Gill falters again to open the door for Rajat Patidar in IND vs ENG Test | Sakshi
Sakshi News home page

#Shubman Gill: నీవు మరి మారవా గిల్‌..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! అతడిని తీసుకోండి?

Published Sun, Jan 28 2024 4:30 PM | Last Updated on Sun, Jan 28 2024 4:48 PM

Shubman Gill falters again to open the door for Rajat Patidar in IND vs ENG Test - Sakshi

టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కాగా గత 9 ఇన్నింగ్స్‌లలో గిల్‌ ఒక్కసారి కూడా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. క

చివరి 9 ఇన్నింగ్స్‌లలో గిల్‌ స్కోర్లు (6), (10), (29*), (2), (26) (36),(10), (23),(0) ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో గిల్‌పై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నీవు మరి మారవా గిల్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే గిల్‌ స్ధానంలో రజిత్‌ పాటిదార్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: IND vs ENG: బెన్‌ స్టోక్స్‌ బుల్లెట్‌ త్రో.. పాపం జడేజా! ఇదే తొలిసారి? వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement