ఆట మర్చిపోయావా గిల్‌.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి? | Fans Trolls On Shubman Gill Over His Poor Form And Dismissal In 1st Test Against ENG, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Trolls On Shubman Gill Out: ఆట మర్చిపోయావా గిల్‌.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి?

Published Fri, Jan 26 2024 11:25 AM | Last Updated on Fri, Jan 26 2024 2:23 PM

Shubman gill poor form continues in Test cricket - Sakshi

వైట్‌ బాల్‌ ఫార్మాట్లలో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. టెస్టుల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సైతం గిల్‌ అదే ఆట తీరును కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 66 బంతులు ఎదుర్కొన్న గిల్‌ కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు.

తన ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఇంగ్లండ్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన శుబ్‌మన్‌.. ఆఖరికి టామ్‌ హార్ట్‌లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటనలో గిల్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు. గత 8 ఇన్నింగ్స్‌లలో గిల్‌ ఒక్కసారి కూడా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు.

చివరి 8 ఇన్నింగ్స్‌లలో గిల్‌ స్కోర్లు (6), (10), (29*), (2), (26) (36),(10), (23) ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు గిల్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అతడి స్ధానంలో ‍మరో ఆటగాడికి ఛాన్స్‌ ఇవ్వాలని భారత అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి కొంత మంది గిల్‌ను పక్కన పెట్టి రజిత్‌ పాటిదార్‌ను జట్టులోకి తీసుకోవాలని ఇక​ ఓవరాల్‌గా తన కెరీర్‌లో ఇప్పటివరకు 21 టెస్టులు ఆడిన గిల్‌.. 1063 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement