జింబాబ్వే క్రికెటర్ క్లైవ్ మండాడే టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో ‘బై’స్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో టెస్టు సందర్భంగా ఈ పరాభవం మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే చేదు జ్ఞాపకాన్ని పోగుచేసుకున్నాడు.
అరంగేట్రంలో డకౌట్
ఏకైక టెస్టు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెల్‌ఫాస్ట్ వేదికగా గురువారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. 71.3 ఓవర్లలో 210 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.
ఓపెనర్లు గుంబీ 49, మస్‌వారే 74 పరుగులతో రాణించారు. సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మండాడే ఏడో స్థానంలో బరిలోకి దిగి.. డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మూర్ 79 రన్స్ చేయగా.. ఆండీ మెక్బ్రైన్ 28 పరుగులతో ఐరిష్ ఇన్నింగ్స్‌లో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కంటే.. 40 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
90 ఏళ్ల రికార్డు బద్దలు
అయితే, ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 24 ఏళ్ల క్లైవ్ మండాడే బైస్ రూపంలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ వికెట్ కీపర్ లెస్ ఆమ్స్ నమోదు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా 147 ఏళ్ల చరిత్రలో ఇలాంటి అన్‌వాంటెడ్ రికార్డు సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.
అయితే, ఇందులో కేవలం క్లైవ్‌ను మాత్రమే తప్పుపట్టడానికి లేదు. జింబాబ్వే బౌలర్లకు కూడా ఇందులో భాగం ఉంది. కాగా 1934లో ఆమ్స్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 37 పరుగులు బైస్ రూపంలో ఇచ్చుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే ఐర్లాండ్ కంటే 28 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది జింబాబ్వే.
తుదిజట్లు
జింబాబ్వే
జోయ్ లార్డ్ గుంబీ, ప్రిన్స్ మస్‌వారే, డియాన్ మేయర్స్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మాండాడే (వికెట్ కీపర్), బ్లెస్సింగ్ ముజరాబానీ, రిచర్డ్ నగరవా, తనకా చివంగా, టెండాయ్ చటారా.
ఐర్లాండ్
ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), పీటర్ మూర్, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), ఆండీ మెక్బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, మాథ్యూ హంఫ్రీస్.
Comments
Please login to add a commentAdd a comment