ఐర్లాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రెడ్‌బాల్ క్రికెట్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమ ఆరేళ్ల నిరీక్షణకు తెరదించింది. 2018లో టెస్టు హోదా పొందిన ఐర్లాండ్.. అప్పటి నుంచి తొలి గెలుపు కోసం ఆరేళ్లగా ఎదురుచూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (58) నాటౌట్‌గా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. అతడితో పాటు లారెన్ టక్కర్(27) పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 2 వికెట్లు, మసూద్, రెహ్మన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్.. ఐర్లాండ్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌కు 108 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్తాన్ ఐర్లాండ్ ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో సత్తాచాటిన ఐరీష్ పేసర్ మార్క్ అడైర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది.
చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
Comments
Please login to add a commentAdd a comment