పుణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక న్యూజిలాండ్ జట్టు 259 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ల దాటకి కివీస్ ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది. ఆఫ్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అశ్విన్ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పు తిప్పులు పెట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అయితే తన రీ ఎంట్రీలో సత్తాచాటాడు.
దాదాపు 3 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ను దెబ్బతీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్ పడగొట్టడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం.
అరుదైన ఘనత..
ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో పూణెలోని ఏంసీఎ స్టేడియంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా సుందర్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా సుందర్ నిలిచాడు.
సుందర్ కంటే ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీఫెన్ ఒకీఫ్ పుణే మైదానంలో 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌పై 7 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో భారత్ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సుందర్ కంటే ముందు ఎస్ వెంకటరాఘవన్, ఎరపల్లి ప్రసన్న, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే
Comments
Please login to add a commentAdd a comment