భారత్ ఆటగాళ్లలో రెడ్ బాల్ క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ఆర్దికపరమైన తాయిలాలు ప్రకటించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
ఓ ఆటగాడు ఏడాది మొత్తంలో జరిగే అన్ని రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొంటే 75 లక్షల రూపాయలు.. అలాగే ఓ ఆటగాడు ఓ ఏడాదిలో జరిగే అన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై బోర్డు పెద్దలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే భారత్‌లో టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో పాటు ఆటగాళ్లకు ఆర్దికంగా భారీ లబ్ది చేకూరుతుంది. ఈ మొత్తం ఐపీఎల్ కాంట్రాక్ట్ వల్ల లభించే మొత్తంతో ఏమాత్రం తీసిపోదు.
ఇదిలా ఉంటే, బీసీసీఐ 2024-25 వార్షిక కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
- ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా..
- ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా..
- బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్..
- సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment