టీమిండియా కెప్టెన్ రోహిత్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో సెంచరీతో (103) కదంతొక్కిన హిట్‌మ్యాన్.. తన టెస్ట్ కెరీర్‌లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (110), అశ్విన్ (9 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (7 వికెట్లు) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్‌లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. లేటు వయసులో టెస్ట్ ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ఎవరికీ సాధ్యంకాని ఈ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉండిన హిట్‌మ్యాన్ ఈ సిరీస్‌లో ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రోహిత్‌తో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, సిరీస్ ఎగరేసుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment