
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి స్థానంలో తాను ఉండి ఉంటే అనుష్క శర్మతో వివాహం చేసుకునేవాడిని కాదని అక్తర్ పేర్కొన్నాడు. వివాహం ఆటగాడి జీవితంలో మరింత బాధ్యతను పెంచుతుంది. విరాట్ కెప్టెన్‌గా ఉండాలని ఎప్పుడూ నేను కోరుకోలేదు అని అతడు తెలిపాడు. "విరాట్ దాదాపు 7 సంవత్సరాలు కెప్టెన్‌గా ఉన్నాడు. నేను ఎప్పుడూ అతడు కెప్టెన్‌గా ఉండాలని అనుకోలేదు. అతడు బ్యాటింగ్‌పై దృష్టి సారించి, 100 నుంచి 120 పరుగులు సాధించాలని కోరుకున్నాను.
కెప్టెన్సీ అదనపు బాధ్యతలు ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. నేను అతని స్థానంలో ఉంటే, నేను అంత త్వరగా పెళ్లి చేసుకో పోయేవాడని. పెళ్లి చేసుకోవడం తప్పని అనడం లేదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని కూడా చెప్పడం లేదు. కోహ్లి 120 సెంచరీలు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగున్ను. విరాట్ కోహ్లి అంటే అభిమానులకు పిచ్చి. మరో 20 ఏళ్లు పాటు విరాట్ క్రికెట్‌లో కొనసాగాలి" అని అక్తర్ పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs SA - Deepak Chahar: గెలిచే అవకాశం ఇచ్చాడు కానీ! కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment