
Shoaib Akhtar's rare picture with his 'daughter': పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో మేటి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరువగా ఉంటున్నాడు. తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు.. వ్యక్తిగత అంశాలు కూడా పంచుకుంటున్నాడు.
కూతురితో ఇలా సరదాగా
ఈ క్రమంలో ఇటీవల ఓ టీనేజ్ అమ్మాయితో ఉన్న ఫొటోను షేర్ చేసిన అక్తర్.. ‘‘చిల్ మోడ్ విత్ మై డాటర్’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఫొటోలో ఉన్న అమ్మాయి తన కూతురని, ఆమె పేరు అలీనా షేక్ అని పేర్కొన్నాడు. అయితే, అక్తర్ ఈ మేరకు చేసిన పోస్ట్ అభిమానులను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసింది.
అక్తర్ షేర్ చేసిన ఫొటో
ఇద్దరు కుమారులే
ఎందుకంటే.. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. షోయబ్ అక్తర్ 2014, జూలై 23న రుబాబ్ ఖాన్ అనే మహిళను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదటి సంతానంగా 2016, నవంబరు 7న మహ్మద్ మైకేల్ అలీ, రెండో సంతానంగా 2019 జూలై 14న మరో కుమారుడికి జన్మనిచ్చింది ఈ జంట.
అయితే, అక్తర్‌కు అకస్మాత్తుగా టీనేజీలో ఉన్న కూతురు ఎలా వచ్చిందన్న అంశంపైనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అక్తర్ ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నాడేమోనని కొందరు.. అతడి అన్న లేదా తమ్ముడి కూతురు అయి ఉంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
హీరోయిన్‌లా ఉంది!
ఇంకొందరు మాత్రం.. ఆ అమ్మాయి ఎవరైనా సరే చాలా అందంగా ఉందని, హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోదంటూ తమదైన శైలిలో ట్వీటుతున్నారు. కాగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడిన అక్తర్.. వరుసగా 178, 247, 19 వికెట్లు పడగొట్టాడు. అత్యంత వేగం( 161.3 kmph)తో బౌలింగ్ చేసిన ఫాస్ట్‌బౌలర్‌గా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు.
చదవండి: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
వరల్డ్ క్రికెట్‌లో రోహిత్ టైగర్.. అతడిని మించినవారు లేరు: ఆసీస్ లెజెండ్
Shoaib Akhtar uploads picture with his daughter@shoaib100mph #ShoaibAkhtar pic.twitter.com/Cf6p22BzIb
— Cricket Pakistan (@cricketpakcompk) June 15, 2023