![Shoaib Akhtar Comments On Criticism For Praising Indian Cricketers - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/3/Shoaib-Akhtar.jpg.webp?itok=qSiZOe9z)
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశంసించినందుకు తనను విమర్శిస్తున్న వారిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. అద్భుత ఆటగాడు విరాట్ కోహ్లిని ప్రశంసిస్తే తప్పేంటని ఘాటుగా ప్రశ్నించాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లు, ఆటగాళ్లపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తనను విమర్శించే వారు విరాట్ కోహ్లి ప్రపంచస్తాయి ఆటగాడిగా గుర్తించాలని కోరారు. ఒకవేళ కోహ్లిపై అనుమానం ఉంటే అతని రికార్డులు తెలుసుకోవాలని సూచించాడు.
మరోవైపు భారత్ వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ సైతం అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. అయితే కోహ్లి భారతీయుడు కాబట్టి, అతన్ని ప్రశంసించవద్దనే ద్వేషాన్ని దృష్టిలో పెట్టుకొని తనను విమర్శిస్తున్నారని ఫాస్టెస్ట్ పేసర్ షోయబ్ తెలిపాడు. కోహ్లి వంటి స్టార్ ప్లేయర్ ప్రపంచ వ్యాప్తంగానైనా ఎవరైనా ఉన్నారా, కనీసం అతనికి దగ్గరగా ఉన్న ఏ ఆటగాడి పేరైనా చెప్పండని విమర్శకులను ప్రశ్నించారు. ఇప్పటికే కోహ్లి 70 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ప్రస్తుత క్రికెట్‌లో ఇన్ని సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు లేరని పేర్కొన్నాడు. చదవండి: ‘అక్తర్ నన్ను చంపుతానన్నాడు’
Comments
Please login to add a commentAdd a comment