షోయబ్ అక్తర్(ఫైల్‌ఫొటో)
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండు రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌పై ఒక ట్వీట్ చేసింది. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు అక్తర్ మూడు బౌన్సర్లు సంధించిన తర్వాత నాల్గో బంతికి ఔట్ చేస్తానంటూ అక్తర్ గారాలు పోవడంతో ఐసీసీ అందుకు వ్యంగ్యంగా స్పందించింది. బాస్కెట్ బాల్ స్టార్ మైకేల్ జోర్డాన్ ఫోటోను షేర్ చేసి అక్తర్‌ను ట్రోల్ చేసింది. దీనిపై అక్తర్ స్పందించాడు. తనకు మీమ్స్-ఎమోజీలతో వీడియోలు పోస్ట్ చేయడం రాదనే విషయాన్ని ఒకవైపు చెబుతూనే.. తాను పోస్ట్ చేసిన ఒరిజనల్ వీడియోకు మీమ్స్ కానీ ఎమోజీలు కానీ వెతకాలంటూ ఐసీసీకి ట్యాగ్ చేశాడు. ‘ డియర్ ఐసీసీ.. కొత్త ఎమోజీ కానీ మీమ్స్ కానీ ఈ వీడియోకి వెతకండి. సారీ.. వాటిని నేను వెతకలేకపోయాను. కేవలం రియల్ వీడియోను మాత్రమే పోస్ట్ చేస్తున్నా’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.(‘క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్’)
నిలకడకు మారుపేరైనా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను నాలుగు బంతుల్లోనే ఔట్ చేస్తానని షోయబ్ అక్తర్ తెలిపాడు. బాల్‌టాంపరింగ్ వివాదంతో ఏడాదిపాటు ఆటకు దూరమైన స్మిత్.. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో అసాధారణ ఆటను ప్రదర్శించాడు. ఏ ఫార్మాట్‌లోనైతే అవమానానికి గురయ్యాడో అందులోనే తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. జట్టు మొత్తం విఫలమైనా ఒక్కడిగా పోరాడి.. తానేంత పవర్ ఫుల్ బ్యాట్స్‌మన్‌నో ప్రపంచానికి చాటాడు. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 774 పరుగులు చేశాడు.(బాస్.. నాకు ఓపెనింగ్ కొత్త కాదు)
అయితే ఈ వయసులో కూడా స్మిత్‌ను నాలుగే బంతుల్లో ఔట్ చేస్తానని అక్తర్ తెలిపాడు. ఓ క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ దీన్ని పేర్కొన్నాడు. పాత తరం-కొత్త తరం ఎవరు ఎవరు మ్యాచ్ అవుతారనే విషయాలను అక్తర్ వెల్లడించాడు. కోహ్లికి షేన్ వార్న్, బాబర్ అజామ్‌కు మెక్‌గ్రాత్, రికీ పాంటింగ్‌కు జోఫ్రా ఆర్చర్ ఇలా కొంతమంది మ్యాచ్‌లను ఎంపిక చేశాడు. ఇక తన వరకూ వచ్చేసరికి స్టీవ్ స్మిత్‌ను ఎంచుకున్నాడు. మూడు బౌన్సర్లు వేసి నాల్గో బంతికి స్మిత్ వికెట్ తీస్తానన్నాడు. దీన్నే ఐసీసీ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేయగా, దానికి అక్తర్ కౌంటర్ ఇచ్చాడు. దీనిలో భాగంగా పలు వీడియోలను పోస్ట్ చేశాడు.
— ICC (@ICC) May 12, 2020
Dear @icc, find a new meme or Emoji. Sorry i couldn't find any, only found some real videos 😂😂 pic.twitter.com/eYID4ZXTvT
— Shoaib Akhtar (@shoaib100mph) May 13, 2020
Comments
Please login to add a commentAdd a comment