అక్రం, అక్తర్ కూడా దూరం | After Aleem Dar withdrawal: Wasim, Shoaib refuse to commentate in India-Africa series | Sakshi
Sakshi News home page

అక్రం, అక్తర్ కూడా దూరం

Published Wed, Oct 21 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

After Aleem Dar withdrawal: Wasim, Shoaib refuse to commentate in India-Africa series

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరిగే చివరి వన్డేకు పాకిస్తాన్‌కు చెందిన వ్యాఖ్యాతలు వసీం అక్రం, షోయబ్ అక్తర్ కూడా దూరం కానున్నారు. ముంబైలో ఈనెల 25న జరిగే ఈ మ్యాచ్ నుంచి తాము తప్పుకుంటున్నట్టు వారు ప్రకటించారు. చెన్నైలో జరిగే నాలుగో వన్డే అనంతరం ఈ జోడి స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ టీమ్ నుంచి తప్పుకుంటారని, ముంబై మ్యాచ్‌కు రెండు రోజుల ముందే పాక్‌కు బయలుదేరతారని అక్రం ఏజెంట్ అర్సలాన్ హైదర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చివరి రెండు మ్యాచ్‌లకు పాక్ అంపైర్ అలీం దార్‌ను ఐసీసీ పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement