Shoaib Akhtar Comments On Rishabh Pant: టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత పంత్‌దే అని కొనియాడాడు. తన దూకుడైన ఆటతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తాడని, వైవిధ్యమైన షాట్లతో అలరిస్తాడంటూ కితాబిచ్చాడు.
అయితే, ఈ 24 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని, బరువు తగ్గితే బాగుంటుందని అక్తర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో పంత్ 125 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.
పంత్ సెంచరీ ఇన్నింగ్స్‌కు హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన తోడు కావడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్ గురించి షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘రిషభ్ పంత్ దూకుడైన ఆటగాడు. ప్రత్యర్థి ఎవరైనా అతడు భయపడడు. కట్ షాట్, పుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, పాడల్ స్వీప్.. ఇలా వైవిధ్యమైన షాట్లు ఆడగలడు. ఆస్ట్రేలియా గడ్డ మీద చిరస్మరణీయ టెస్టు విజయం అందించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు’’ అని పంత్‌ను ప్రశంసించాడు.
బాగుంటాడు.. మోడల్ అయితే!
ఇక ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఉండాల్సిన దానికన్నా పంత్ ఎక్కువ బరువు ఉన్నాడు. ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. ఇండియన్ మార్కెట్ చాలా పెద్దదన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి పంత్ చూడటానికి బాగుంటాడు.
గట్టిగా ప్రయత్నిస్తే మోడల్‌గా రాణించగలడు. కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఎవరైనా సూపర్‌స్టార్‌గా అవతరిస్తే కచ్చితంగా వారిపై కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉంటారు కదా’’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. యూకే టూర్ ముగించుకుని ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.
చదవండి: NZ vs IRE: తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..!
Comments
Please login to add a commentAdd a comment