టీమిండియా(PC: BCCI)
India Vs England ODI Series 2022- India Win- Rohit Sharma Comments: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. రి సమిష్టిగా రాణించి గెలుపొందాలని భావించామని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడి గెలుపొందడం అంత తేలికేమీ కాదని.. గతంలో ఇక్కడ ఓటమి పాలైన విషయం తనకు గుర్తుందన్నాడు హిట్‌మ్యాన్.
కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఆదివారం(జూలై 17)ఆఖరి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనప్పటికీ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తమ అద్భుతమైన ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఇంగ్లండ్ గడ్డ మీద 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
A special innings from Pant.
— England Cricket (@englandcricket) July 17, 2022
Congratulations to India on winning the series 👏
Scorecard/clips: https://t.co/2efir2v7RD
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/eaallO99XW
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘మిడిలార్డర్‌లో హార్దిక్, పంత్ ఎక్కువగా ఆడలేదు. అయినప్పటికీ ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో సానుకూల దృక్పథంతో ముందుకు సాగిన విధానం అమోఘం. ఏమాత్రం బెదురు లేకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
మంచి మంచి షాట్లు ఆడారు. ఇక చహల్.. మా జట్టులో కీలక సభ్యుడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడికి అనుభవం ఉంది. ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పుంజుకున్న తీరు ప్రశంసనీయం. బంతితోనూ.. బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేస్తున్నాడు.
A wonderful catch! 🤲
— England Cricket (@englandcricket) July 17, 2022
Scorecard/clips: https://t.co/2efir2v7RD
🏴 #ENGvIND 🇮🇳 @benstokes38 pic.twitter.com/y8aIjexf3Q
ఇక ఈ సిరీస్‌లో టాపార్డర్ విఫలమైన తీరు గురించి పెద్దగా చెప్పేదేమీ లేదు. బెంచ్ స్ట్రెంత్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో వెస్టిండీస్ టూర్‌లో కొంతమందికి అవకాశాలు దక్కాయి’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన రోహిత్ సేన.. సుమారు రెండేళ్ల తర్వాత విదేశీ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టుగా నిలిచింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో వన్డే:
►వేదిక: ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్
►టాస్: ఇండియా- బౌలింగ్
►ఇంగ్లండ్ స్కోరు: 259 (45.5)
►ఇండియా స్కోరు: 261/5 (42.1)
►విజేత: ఇండియా.. 5 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషభ్ పంత్(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 125 పరుగులు- నాటౌట్)
►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: హార్దిక్ పాండ్యా(మూడో వన్డేలో 4 వికెట్లు తీయడం సహా 71 పరుగులు సాధించాడు)
చదవండి: ENG vs IND: చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి భారత ఆటగాడిగా..!
ENG vs IND: సెంచరీతో చెలరేగిన పంత్..వన్డేల్లో అరుదైన రికార్డు..!
Comments
Please login to add a commentAdd a comment