
Shoaib Akthar Praise Virat Kohli.. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రశంసల్లో ముంచెత్తాడు. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లను అమితంగా ఇష్టపడతారని పేర్కొన్నాడు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లాంటి ఆటగాళ్లకు విపరీతమైన అభిమానం ఉంటుందని తెలిపాడు.
''కోహ్లిని టీమిండియా జట్టులో ఇంజమామ్ ఉల్ హక్‌గా అభివర్ణిస్తారని.. అతను పరుగులు చేయడంలో మెషిన్ గన్ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. ఇక పాకిస్తాన్- టీమిండియా పోరు గురించి ఏం మాట్లాడదలచుకోలేదు. నా దృష్టిలో ఎవరు ఫెవరెట్ అనేది చెప్పడం కష్టమే. మ్యాచ్ జరిగిన రోజే ఎవరికి అనుకూలంగా ఉంటే వారినే విజయం వరిస్తుంది. ఐసీసీ మేజర్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై టీమిండియాదే స్పష్టమైన ఆధిక్యం. కానీ ఈసారి ఆ రికార్డు తిరగరాసే చాన్స్ ఉంది. టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఇండియాలోనూ నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పాక్ ఫెవరెట్ అంటే భారత అభిమానులు బాధపడతారు.. టీమిండియా ఫెవరెట్ అంటే పాక్ అభిమానులు గోల చేస్తారు. అందుకే సెంటిమెంట్స్ జోలికి వెళ్లదలచుకోలేను.'' అని అభిప్రాయపడ్డాడు.
చదవండి: T20 WC 2021: తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు