
Virat Kohli First Time Dismissal Vs Pak T20 WC: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి మరోసారి మెరిశాడు. టి20 ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై తనకున్న రికార్డును కోహ్లి నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌లో కోహ్లి పాకిస్తాన్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 2012, 2014, 2016 టి20 ప్రపంచకప్‌లలో కోహ్లి వరుసగా 78 నాటౌట్, 36 నాటౌట్, 55 నాటౌట్‌గా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 57 పరుగులు చేసిన కోహ్లి ఈసారి మాత్రం ఔటయ్యాడు. దీంతో మూడు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన కోహ్లి ఈసారి మాత్రం ఆ రికార్డును కాపాడలేకపోయాడు.
ఇక టి20 ప్రపంచకప్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లి(పాకిస్తాన్‌పై 226 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో విండీస్ హిట్టర్ క్రిస్ గేల్(274 పరుగులు, ఆస్ట్రేలియాపై), శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్(238 పరుగులు, న్యూజిలాండ్‌పై), శ్రీలంక మాజీ ఆటగాడు జయవర్దనే( 226 పరుగులు, న్యూజిలాండ్‌పై) కోహ్లితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment