వైరల్‌: బొక్కబోర్లాపడ్డ బ్యాట్స్‌మన్‌ | Viral Video From Shoaib Akhtar Twitter | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. బొక్కబోర్లాపడ్డ బ్యాట్స్‌మన్‌

Published Sun, Jan 31 2021 2:13 PM | Last Updated on Sun, Jan 31 2021 3:51 PM

Viral Video From Shoaib Akhtar Twitter - Sakshi

జెంటిల్‌మెన్‌ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌కు అభిమానులు అంతాఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా కోటాదీ కోట్లమంది ఈ ఆటను వీక్షిస్తారు. ఇంటర్‌నెట్‌ ప్రపంచం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఆటకు ఆదరణ మరింత పెరిగిపోయింది. ప్రపంచ నలుమూలలా ఏదో ఓ దిక్కను మ్యాచ్‌లు జరుగుతుండటం.. మ్యాచ్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం ఆటగాళ్లకు నిత్యజీవితంలో అలవాటుగా మారిపోయింది. ఇరుజట్ల మధ్య భావోద్వేగాలను రగిలించే క్రికెట్‌లో పలు సందర్భల్లో ఫన్నీ ఇన్సిడెంట్స్‌ కూడా చోటుచేసుకుంటాయి. ఇలాంటి ఈ వీడియోనే పాకిస్తాన్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చే బాల్‌ను ఎదుర్కొంటే ఆ బ్యాట్స్‌మెన్‌ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండీ అంటూ ఓ వీడియోను వదిలాడు. ఈ వీడియోలో ఓ ఆటగాడు బౌలర్‌ను ఎదుర్కోలేక పిచ్‌పై బొక్కబోర్లాపడ్డ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది. అక్తర్‌ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement