కేటీఆర్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రజాప్రతినిధుల్లో ఒకరు. రాజకీయాలతో పాటు ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా సాయం కోరిన వారికి సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన ఒక ట్వీట్‌పై స్పందించారు. ‘ది బెటర్ ఇండియా’ అనే ట్విటర్ హాండిల్ ట్వీట్ చేసిన ఓ వీడియోలో.. మెహక్ ఫాతిమా అనే ఆరేళ్ల చిన్నారి క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంది.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఈ చిన్నారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆమె తండ్రి.. తన తమ్ముడికి మాత్రమే క్రికెట్ నేర్పిస్తున్నాడు. ఆమెకు క్రికెట్ నేర్పించడంలేదు. దీంతో ‘నేను అమ్మాయినని నాకు క్రికెట్ నేర్పించడం లేదా నాన్నా?’ అని మెహక్ తన తండ్రిని ప్రశ్నించింది.
చిన్నారి మాటలకు.. ఆ తండ్రి ఆమెకు కూడా క్రికెట్ ఆడటం నేర్పించాడు. దీంతో ఆమె చేతిలో బ్యాటుతో క్రికెట్ ఇరగదీస్తోంది. అయితే ఈ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ లవ్ సింబల్‌తో రీట్వీట్ చేశారు. ప్రొఫెషనల్ క్రీడాకారుల మాదిరిగా.. ఆమె మంచి ఫుట్‌వర్క్, చక్కటి బ్యాలెన్స్‌తో షాట్స్ కొడుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
— KTR (@KTRTRS) February 23, 2022
Comments
Please login to add a commentAdd a comment