ఆసియాకప్-2023 సూపర్-4లో పాకిస్తాన్ బౌలర్లకు భారత ఓపెనర్లు చుక్కలు చూపించారు. లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై విఫలమైన రోహిత్ శర్మ, గిల్.. ప్రధాన దశలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని రోహిత్, గిల్ చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రోహిత్(56), గిల్(58) పరుగులతో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ జట్టు బాధ్యతను తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అందరూ ఊహించిన అతిథి వచ్చేశాడు. అదేనండి వరుణుడు. భారీ స్కోర్‌దిశగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ జోరుకు వర్షం కళ్లెం వేసింది.
భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన సోమవారంకు అంపైర్‌లు వాయిదా వేశారు. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను వర్షం కాపాడిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
'నేను భారత్-పాక్ మ్యాచ్ చూడటానికి ఇక్కడకు వచ్చాను. నాతో పాటు ఇరు దేశాల అభిమానులు మ్యాచ్ ప్రారంభం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మా జట్టును వర్షం కాపాడిందనిఅనుకోవాలి.
అంతకుముందు లీగ్ మ్యాచ్‌లో భారత్‌ను వర్షం రక్షించింది. కానీ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బాబర్ బౌలింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అది తెలివైన నిర్ణయం కాదు" అని సోషల్ మీడియాలో ఓ వీడియోను అక్తర్ పోస్ట్ చేశాడు.
చదవండి: Asia Cup 2023: రిజర్వ్‌డే రోజు కూడా వర్షం పడితే.. ఏంటి పరిస్థితి? అలా జరిగితే భారత్‌కు కష్టమే
Well. I don't see this starting again. Colombo ki baarish is crazy pic.twitter.com/KiY8Mbzl77
— Shoaib Akhtar (@shoaib100mph) September 10, 2023
Comments
Please login to add a commentAdd a comment