ఆసియాకప్ 2023 సూపర్-4లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కొలంబో వేదికగా మధ్యహ్నం 3 గంటలకు జరగనుంది. ఇక భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ తమ బౌలర్లకు కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో ఎక్కువగా చర్చల్లో పాల్గొనవద్దని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సూచించాడు.
తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ మాట్లాడుతూ.. బౌలర్లు ఎక్కువగా విరాట్ కోహ్లితో మాట్లాడకూడదు. అతడిని ఒత్తడిలోకి నెట్టి, ఆటపై దృష్టి కోల్పోయేలా చేయాలి. అతడు తన రిథమ్‌లో వచ్చాడంటే అపడం ఎవరు తరం కాదు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపిస్తాడని చెప్పుకొచ్చాడు.
కాగా ఈ టోర్నీలో కోహ్లి రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. పాకిస్తాన్‌పై మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే పాక్‌పై మాత్రం కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో నేటి మ్యాచ్‌లో విరాట్ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డేను కేటాయించింది.
చదవండి: Asia Cup 2023: అది నిజంగా సిగ్గుచేటు.. భారత్- పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డేపై టీమిండియా లెజెండ్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment