ICC ODI WOrld Cup 2023: ‘‘అప్పట్లో ఒకడుండేవాడు.. మొత్తం ఒత్తిడి తానే భరించి జట్టును రిలాక్స్‌గా ఉంచేవాడు. అతడు మరెవరో కాదు ధోని. జట్టు మొత్తం అతడి వెనుకే ఉండేది. అందరి భారాన్ని అతడే మోసేవాడు’’ అంటూ పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కొనియాడాడు.
రోహిత్ శర్మ మంచి బ్యాటర్ అని, అయితే కెప్టెన్‌గా ఒత్తిడి అధిగమించలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన ఘనత మిస్టర్ కూల్ సొంతం.
పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై..
ఇదిలా ఉంటే.. పుష్కరకాలం తర్వాత మరోసారి భారత్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ నేపథ్యంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా విరాట్ కోహ్లి నుంచి టీమిండియా పగ్గాలు చేపట్టిన తర్వాత హిట్‌మ్యాన్ ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టాడు.
కానీ ఆసియా టీ20 కప్, టీ20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ల రూపంలో ఎదురైన సవాలును మాత్రం ఎదుర్కోలేకపోయాడు. ఈ మూడు ఈవెంట్లలో జట్టును విజేతగా నిలపలేక రోహిత్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ కెప్టెన్ కాకుంటేనే బాగుండేది
‘‘రోహిత్ మంచి బ్యాటర్. కానీ కెప్టెన్ అయిన తర్వాత ఆందోళనకు గురవుతున్నాడు. భయపడిపోతున్నాడు. రోహిత్ పట్ల నా వ్యాఖ్యలు పరుషంగా అనిపించవచ్చు... కానీ రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోకపోయి ఉంటే ఆటగాడిగా మరింత మెరుగ్గా ఉండేవాడు.
నిజానికి విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ అంత టాలెంటెడ్ కాదు. అతడు ఆడిన షాట్లు కోహ్లి కూడా ఆడలేడు. క్లాసిక్ బ్యాటర్. అలాంటి ప్లేయర్‌కు కెప్టెన్సీ ఎందుకు? ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడిగాను.
ఆనాడే దాయాదుల సమరం
క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఒత్తిడిని జయించగలడా? అంటే లేదు అనే సమాధానమే! రోహిత్ కూడా ఇలా తనను తాను ప్రశ్నించుకోవాలి’’ అని రెవ్‌స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ కెప్టెన్ పదవి తీసుకోకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య అక్టోబరు 14న అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగనుంది.
చదవండి: ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు!
కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment