క్రికెట్ అభిమానులను ఉర్రుతలూగిస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 తుది అంకానికి చేరుకుంది. జూన్ 29 (శనివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడనుంది. ఈ టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనునన్నాయి.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండో వరల్డ్‌కప్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని భారత జట్టు భావిస్తే.. దక్షిణాఫ్రికా మాత్రం తొలి సారి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు నుంచి ముప్పు పొంచి ఉందని సఫారీలను అక్తర్ హెచ్చరించాడు.
"సెమీస్‌లో భారత్ అద్బుతమైన విజయం సాధించింది. వారు ఈ విజయానికి నిజంగా అర్హులు. ఫైనల్‌కు చేరినందుకు టీమిండియాకు నా అభినందనలు. గత రెండు వరల్డ్‌కప్(టీ20, వన్డే)ల్లో టీమిండియా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించాను.
కానీ ఆఖరి మెట్టుపై భారత్ బోల్తా పడింది. ఈ సారి కూడా భారత్ ఛాంపియన్స్‌గా నిలవాలని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు తీవ్రమైన పోటీ ఎదురుకానుంది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలి. అప్పుడే ప్రోటీస్ ఎడ్జ్‌లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం గెలుపు అవకాశాలు తక్కువ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారు తొలిసారి ఫైనల్లో తలపడతున్నారు. కచ్చితంగా వారిపై ఒత్తిడి ఉంటుంది.
అంతేకాకుండా భారత జట్టులో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వారిని ఎదుర్కొని ప్రోటీస్ బ్యాటర్లు ఎలా పరుగులు సాధిస్తారో ఆర్ధం కావడం లేదు. చివరిగా ఈ ఫైనల్ పోరులో భారత్ గెలవాలని నేను కోరుకుంటున్నానని" తన యూట్యూబ్ ఛానల్‌లో అక్తర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment