India South Africa Tour: Hardik Pandya Request Selectors Not To Consider Him - Sakshi
Sakshi News home page

Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా సంచలన నిర్ణయం.. ఇక భారత జట్టుకు..!

Published Sun, Nov 28 2021 3:16 PM | Last Updated on Sun, Nov 28 2021 3:40 PM

India South Africa Tour: Hardik Pandya Request Selectors Not To Consider Him Says Reports - Sakshi

Hardik Pandya Request Selectors Not To Consider Him: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఆకట్టుకోలేకపోయిన పాండ్యా.. టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలోనూ రాణించలేకపోయాడు. అటు బౌలింగ్‌ చేయలేక.. ఇటు బ్యాటర్‌గా కూడా మెరుగైన ప్రదర్శన కనబరచలేక విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా పాండ్యా ఎంపిక కాలేదు.

కాగా వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్‌ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పూర్తి స్ధాయి ఫిట్‌నెస్‌ సాధించినంతవరకు తనను సెలక్షన్‌లోకి పరిగణించవద్దు అని సెలెక్టర్లను కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం​ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అయితే నెటజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెట్‌జన్‌ స్పందిస్తూ.. 'నీవు ఏంటి సెలెక్టర్లను  కోరేది, వాళ్లే నిన్ను సెలక్ట్‌ చేయరు' అని కామెంట్‌ చేశాడు.

చదవండి: Ind Vs Nz 1st Test 2021: గిల్ ఓపెనర్‌గా కాకుండా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement