అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్‌మ్యాన్ (3/15), రాఫ్ మెక్‌మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
168 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కల్లమ్ ముల్దర్ బౌలింగ్‌లో మురుగన్ అశ్విన్ (42) ఔటయ్యాడు.
ఎనిమిదో వికెట్ డౌన్
వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. 122 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మెక్‌మిలన్ బౌలింగ్‌లో రాజ్ లింబాని (0) క్లీన్ బౌల్డయ్యాడు.
ఏడో వికెట్ కోల్పోయిన భారత్
115 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. బియర్డ్‌మ్యాన్ బౌలింగ్‌లో ఆదర్శ్ సింగ్ (47) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 139 పరుగులు చేయాలి. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ఆరో వికెట్ డౌన్
91 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. తెలంగాణ కుర్రాడు అవనీశ్ రాఫ్ మెక్‌మిలన్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు.
పీకల్లోతు కష్టాల్లో భారత్
వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఆండర్సన్ బౌలింగ్‌లో ప్రియాంశు మోలియా (9) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 164 పరుగులు చేయాలి. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆదర్శ్ సింగ్ (32), అవీనశ్ రావు క్రీజ్‌లో ఉన్నారు.
68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్
ఛేదనలో యంగ్ ఇండియా 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ త్రయం ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్ సహా అర్శిన్ కులకర్ణి ఔట్ కాగా.. ఆదర్శ్ సింగ్ (31), ప్రియాంశు మోలియా (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో మరో 170 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ముషీర్ ఖాన్ క్లీన్ బౌల్డ్
40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బియర్డ్‌మెన్ బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆదర్శ్ సింగ్ (12), ఉదయ్ సహారన్ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 213 పరుగులు చేయాలి. చేతిలో మరో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ జట్టు 3 పరుగులకే వికెట్ కోల్పోయింది. కల్లమ్ విడ్లెర్ బౌలింగ్‌లో ర్యాన్ హిక్స్‌కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ కులకర్ణి (3) ఔటయ్యాడు. ఆదర్శ్ సింగ్‌కు జతగా ముషీర్ ఖాన్ క్రీజ్‌లోకి వచ్చాడు.
టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్
187 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో రాఫ్ మెక్‌మిలన్ (2) ఔట్ అయ్యాడు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/6గా ఉంది. ఒలివర్ పీక్ (10), చార్లీ ఆండర్సన్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌమీ పాండే బౌలింగ్‌లో హర్జస్ సింగ్ (55) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 38 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 181/5గా ఉంది. ఒలివర్ పీక్ (6), రాఫ్ మెక్‌మిలన్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్
165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రాజ్ లింబాని బౌలింగ్‌లో ర్యాన్ హెండ్రిక్స్ (20) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 35 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 167/గా ఉంది. ఒలివర్ పీక్ (1), హర్జస్ సింగ్ (46) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
99 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. నమన్ తివారి బౌలింగ్‌లో మురుగన్ అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి హ్యారీ డిక్సన్ (42) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 100/3గా ఉంది. ర్యాన్ హిక్స్ (1), హర్జస్ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
94 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. నమర్ తివారి బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ క్యాచ్ పట్టడంతో హగ్ వెబ్జెన్ (48) ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 94/2గా ఉంది. హ్యారీ డిక్సన్ (39), హర్జస్ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 49/1
12 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(244), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1
8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(14), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ రాజ్ లింబానీ బౌలింగ్‌లో సామ్ కాన్స్టాస్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0
2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0
2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డిక్సాన్(15), సామ్ కాన్స్టాస్(0) పరుగులతో ఉన్నారు.
అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పుతో ఆడనుంది. కాగా భారత్-ఆసీస్ ఫైనల్లో తలపడడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఫైనల్ పోరులో రెండు సార్లు భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక్కసారి గెలుపొందింది.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్ (కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలీ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫెల్ మాక్‌మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్
భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ అహ్మద్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (వికెట్‌కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే
Comments
Please login to add a commentAdd a comment