ఆస్ట్రేలియా 245/9  | 2nd test: Australia 245/9 | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా 245/9 

Published Sat, Mar 24 2018 12:52 AM | Last Updated on Sat, Mar 24 2018 12:52 AM

2nd test: Australia 245/9 - Sakshi

కేప్‌టౌన్‌: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు కూడా పోటాపోటీగా సాగింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బెన్‌క్రాఫ్ట్‌ (77) అర్ధ సెంచరీతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్లు మోర్నీ మోర్కెల్‌ (4/87), రబడ (3/81) ధాటికి ఆసీస్‌ ఒక దశలో 175 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఎదురుదాడికి దిగిన లయన్‌ సఫారీలను అడ్డుకున్నాడు.

8 ఫోర్లతో 47 పరుగులు చేసిన అతను, పైన్‌ (33 బ్యాటింగ్‌)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 266/8తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 311 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు అజేయంగా నిలిచిన ఎల్గర్‌ (141 నాటౌట్‌) మూడో సారి ఈ ఘనత సాధించి విండీస్‌ దిగ్గజం హేన్స్‌తో సమంగా నిలవడం విశేషం. ఈ మ్యాచ్‌లో మోర్కెల్‌ 300 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement