
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో తాము అనుకున్నదాని కంటే 30 పరుగులు అదనంగా ఇచ్చామని పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఆట ముగిసిన అనంతరం అతడు మాట్లాడుతూ... ఓవర్‌కు 4 పరుగుల రన్‌రేట్ అనేది టెస్టుల్లో ఎక్కువేనని పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అలా జరగకుండా చూడాల్సి ఉందన్నాడు. ‘అయిదు వికెట్ల ప్రదర్శన మిస్ అయినందుకు బాధపడటం లేదు. క్యాచ్‌లు చేజారకుండా చూసుకోవాలి. ప్రత్యర్థి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యపర్చలేదు.
మేం టాస్ నెగ్గితే బౌలింగే తీసుకునేవారం’ అని వివరించాడు. మరో వైపు దక్షిణాఫ్రికా కోచ్ తొలి రోజు ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ‘12 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో అసలు తర్వాతి పరుగులు ఎలా వస్తాయో అర్థం కాలేదు. ఉబెర్ క్యాబ్ తీసుకొని ఇక్కడినుంచి పారిపోవాలని అనిపించింది. అయితే మా చేతుల్లో ఆ సమయంలో సెల్ ఫోన్ లేకపోవడం వల్ల అలా చేయలేకపోయాను’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment