
భువనేశ్వర్: వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలవాలనుకున్న భారత జూనియర్ హాకీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–4 గోల్స్‌తో ఆరుసార్లు చాంపియన్ జర్మనీ చేతిలో ఓడింది. జర్మనీ తరఫున ఎరిక్ (15వ ని.లో), ఫ్లాటెన్ (21వ ని.లో), ముల్లర్ (24వ ని.లో), క్రిస్టోఫర్ (25వ ని.లో) గోల్స్ చేశారు.
భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్ (25వ ని.లో), బాబీ సింగ్ (60వ ని.లో) చెరో గోల్ సాధించారు. మరో సెమీఫైనల్లో అర్జెంటీనా ‘షూటౌట్’లో 3–1 తో ఫ్రాన్స్‌పై నెగ్గింది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగే పోరులో ఫ్రాన్స్‌తో భారత్ ఆడుతుంది.
చదవండి: IND vs NZ: ఐపీఎల్‌లో ఆ అంపైర్‌తో గొడవపడ్డ కోహ్లి.. అందుకే ఔట్ ఇచ్చాడా...
Comments
Please login to add a commentAdd a comment