![Tristan Stubbs maiden ODI ton moves South Africa into 2-0 lead](/styles/webp/s3/article_images/2024/10/5/WhatsApp%20Image%202024-10-05%20at%2016.31.46.jpeg.webp?itok=FqXmERHo)
అబుదాబి వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 174 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రోటీస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. సఫారీ బౌలర్ల దాటికి కేవలం 169 పరుగులకే కుప్పకూలింది.
ప్రోటీస్ పేసర్ లిజార్డ్ విలియమ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, జార్న్ ఫోర్టుయిన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, బార్టమన్ చెరో వికెట్ పడగొట్టారు. ఐరీష్ బ్యాటర్లలో క్రెయిగ్ యంగ్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సెంచరీతో చెలరేగిన స్టబ్స్..
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 81 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
స్టబ్స్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. స్టబ్స్‌తో పాటు వెర్నయనే(67), ముల్డర్(43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్, కాంఫ్‌హర్, హోయ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఆక్టోబర్ 7న అబుదాబి వేదికగా జరగనుంది.
చదవండి: T20 WC: న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే?
Comments
Please login to add a commentAdd a comment