ఒటిస్ గిబ్సన్ (ఫైల్ ఫొటో)
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అనూహ్య రిటైర్మెంట్‌పై క్రికెట్ ప్రపంచం మొత్తం విస్తుపోయింది. మైదానంలోని తన ప్రత్యేకమైన ఆటతో ఏబీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. అయితే ఏబీ అనూహ్య నిర్ణయంతో తాను షాక్‌కు గరైనట్లు దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ తెలిపాడు.
తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏబీ ప్రకటనతో షాకయ్యా. ఏబీ రిటైర్మెంట్ ప్రకటించే ఉదయం నన్ను పిలిచి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పె యోచనలో ఉన్నట్లు తెలిపాడు. నేను నిజంగా ఆలోచించే మాట్లాడుతున్నావా? నీవు చేసేది సరైనదేనా అని ప్రశ్నించా. అతను అలసిపోయానని తెలిపాడు. కానీ ఇంతలోనే అతని నిర్ణయాన్ని ప్రకంటించాడు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యా. ఏబీ గొప్ప బ్యాట్స్‌మన్. అతని నిర్ణయం అభిమానులను, దేశప్రజలను నిరాశపరిచింది. ఐపీఎల్‌లో అతని స్పైడర్‌మన్ క్యాచ్‌లు చూసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడని అనుకున్నాం. కానీ ఇలా క్రికెట్ దూరం అవుతాడని ఊహించలేదు. టెస్టు మ్యాచ్‌లు అతని ఇష్టం.. ప్రపంచకప్ దృష్ట్యా కనీసం వన్డేలోనైనా కోనసాగాల్సింది. నిర్ణయం తీసుకోకముందే అతనితో ఈ విషయంపై మాట్లాడల్సింది. ఏబీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే అతన్ని మార్చడం చాలా కష్టం.’ అని గిబ్సన్ చెప్పుకొచ్చాడు.
అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు ఏబీ ట్వీటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలసిపోయినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న మిస్టర్ 360.. 2004 డిసెంబరు 17న ఇంగ్లండ్‌పై తాను టెస్టు అరంగేట్రం చేసిన పోర్ట్ ఎలిజబెత్ మైదానం నేపథ్యంలో చిత్రీకరించిన ‘రిటైర్మెంట్ వీడియో’ సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment