Ottis Gibson
-
ఏబీ ప్రపంచకప్ వరకు కొనసాగాల్సింది
-
అతని నిర్ణయంతో షాకయ్యా: దక్షిణాఫ్రికా కోచ్
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అనూహ్య రిటైర్మెంట్పై క్రికెట్ ప్రపంచం మొత్తం విస్తుపోయింది. మైదానంలోని తన ప్రత్యేకమైన ఆటతో ఏబీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. అయితే ఏబీ అనూహ్య నిర్ణయంతో తాను షాక్‌కు గరైనట్లు దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ తెలిపాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏబీ ప్రకటనతో షాకయ్యా. ఏబీ రిటైర్మెంట్ ప్రకటించే ఉదయం నన్ను పిలిచి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పె యోచనలో ఉన్నట్లు తెలిపాడు. నేను నిజంగా ఆలోచించే మాట్లాడుతున్నావా? నీవు చేసేది సరైనదేనా అని ప్రశ్నించా. అతను అలసిపోయానని తెలిపాడు. కానీ ఇంతలోనే అతని నిర్ణయాన్ని ప్రకంటించాడు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యా. ఏబీ గొప్ప బ్యాట్స్‌మన్. అతని నిర్ణయం అభిమానులను, దేశప్రజలను నిరాశపరిచింది. ఐపీఎల్లో అతని స్పైడర్‌మన్ క్యాచ్‌లు చూసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడని అనుకున్నాం. కానీ ఇలా క్రికెట్ దూరం అవుతాడని ఊహించలేదు. టెస్టు మ్యాచ్‌లు అతని ఇష్టం.. ప్రపంచకప్ దృష్ట్యా కనీసం వన్డేలోనైనా కోనసాగాల్సింది. నిర్ణయం తీసుకోకముందే అతనితో ఈ విషయంపై మాట్లాడల్సింది. ఏబీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే అతన్ని మార్చడం చాలా కష్టం.’ అని గిబ్సన్ చెప్పుకొచ్చాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు ఏబీ ట్వీటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలసిపోయినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న మిస్టర్ 360.. 2004 డిసెంబరు 17న ఇంగ్లండ్‌పై తాను టెస్టు అరంగేట్రం చేసిన పోర్ట్ ఎలిజబెత్ మైదానం నేపథ్యంలో చిత్రీకరించిన ‘రిటైర్మెంట్ వీడియో’ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చదవండి: ‘ఏబీ’భత్సానికి బ్రేక్ -
‘చెత్త ఫీల్డింగ్‌తోనే ఓడిపోయాం’
కేప్‌టౌన్ : భారత్‌తో జరిగిన చివరి టీ20లో ఓటమికి తమ ఆటగాళ్ల చెత్త ఫీల్డింగే కారణమని దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ అభిప్రాయపడ్డారు. సులువైన క్యాచ్‌లను జారవిడచడమే కాకుండా.. బంతిని ఆపడంలోను తమ ఆటగాళ్లు తడబడ్డారన్నారు. కేవలం ఈ మ్యాచ్‌లోనే కాదు ఓవరాల్ సిరీస్‌లో ఇవే తప్పులను ఆతిథ్య ఆటగాళ్లు చేశారని దీంతోనే సీరీస్లు కోల్పోయామన్నారు. ఇక భారత్‌లో అనుభవ బౌలర్లైన భువనేశ్వర్, బుమ్రాలు అద్భుతంగా రాణించారని, పవర్‌ప్లేలో పరుగులు రాకుండా కట్టడిచేశారని కితాబిచ్చారు. వారికి ఐపీఎల్ అనుభవం ఎంతగానో సహకరించిందని గిబ్సన్ పేర్కొన్నారు. తమ జట్టులో సైతం ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లున్నారని కానీ వారంతగా రాణించలేదన్నారు. ముఖ్యంగా క్రిస్మొర్రిస్ను ఎన్నో సార్లు మ్యాచ్ విన్నర్‌గా చూశామని, కానీ అతని బౌలింగ్‌లో ఇంకా స్థిరత్వం కావాలని గిబ్సన్ చెప్పుకొచ్చారు. ఈ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన డాలా, క్లాసెన్, జాన్కర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడారు. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కూడా సిరీస్ ఒటమికి ఓ కారణమని తెలిపారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో కుర్రాళ్లు తడుబడుతున్నారని, సఫారీలకు అసలు పరీక్ష ఆస్ట్రేలియాతో ఎదురుకాబోతున్నది తెలిపారు. మార్చి1 నుంచి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా 4 టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. చివరి టీ20లో సఫారీ స్పిన్నర్ షామ్సీ ధావన్ 9, 34 పరుగుల వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను జారవిడిచిన విషయం తెలిసిందే. అనంతరం ధావన్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. -
ధోనిసేనను ఓడించే సత్తావుంది: విండీస్ కోచ్ గిబ్సన్
బ్రిడ్జ్‌టౌన్ : ధోనిసేనను కంగుతినిపించే సత్తా తమ ఆటగాళ్లకు వుందని వెస్టిండీస్ కోచ్ ఒటిస్ గిబ్సన్ అన్నారు. వచ్చే నెలలో విండీస్ జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారని... ఈ టూర్లో విండీస్ జట్టు రాణిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ సారి ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుంది. గత పర్యటనలో అనుభవలేమి మాకు ప్రతికూలించింది. కానీ ఇప్పుడు ఆ కొరత లేదు. తప్పకుండా చక్కని ప్రదర్శన కనబరుస్తాం’ అని గిబ్సన్ చెప్పారు. భారత పర్యటనలో వెస్టిండీస్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ అంతర్జాతీయ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్న సిరీస్ ఇది. తొలి టెస్టు నవంబర్ 6 నుంచి 10 వరకు కోల్‌కతాలో జరగనుంది. సచిన్ ఆడనున్న 200వ టెస్టు, సిరీస్‌లో రెండో టెస్టు 14 నుంచి 18 వరకు ముంబైలో జరుగుతుంది.