ధోనిసేనను ఓడించే సత్తావుంది: విండీస్ కోచ్ గిబ్సన్ | We can beat India: Windies coach gibson | Sakshi
Sakshi News home page

ధోనిసేనను ఓడించే సత్తావుంది: విండీస్ కోచ్ గిబ్సన్

Published Mon, Oct 21 2013 7:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

We can beat India: Windies coach gibson

బ్రిడ్జ్‌టౌన్ : ధోనిసేనను కంగుతినిపించే సత్తా తమ ఆటగాళ్లకు వుందని వెస్టిండీస్ కోచ్ ఒటిస్ గిబ్సన్ అన్నారు. వచ్చే నెలలో విండీస్ జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారని... ఈ టూర్‌లో విండీస్ జట్టు రాణిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ సారి ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుంది. గత పర్యటనలో అనుభవలేమి మాకు  ప్రతికూలించింది. కానీ ఇప్పుడు ఆ కొరత లేదు. తప్పకుండా చక్కని ప్రదర్శన కనబరుస్తాం’ అని గిబ్సన్ చెప్పారు. భారత పర్యటనలో వెస్టిండీస్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

 

మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ అంతర్జాతీయ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్న సిరీస్ ఇది. తొలి టెస్టు నవంబర్ 6 నుంచి 10 వరకు కోల్‌కతాలో జరగనుంది.   సచిన్ ఆడనున్న 200వ టెస్టు, సిరీస్‌లో రెండో టెస్టు 14 నుంచి 18 వరకు ముంబైలో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement