"దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలవడం చాలా కష్టం.. సిరీస్‌ వాళ్లదే" | Aakash Chopra makes his prediction for Ind vs SA Test series | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలవడం చాలా కష్టం.. సిరీస్‌ వాళ్లదే: టీమిండియా మాజీ క్రికెటర్‌

Published Sat, Dec 25 2021 1:03 PM | Last Updated on Sat, Dec 25 2021 2:02 PM

Aakash Chopra makes his prediction for Ind vs SA Test series - Sakshi

సౌతాఫ్రికా-భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టెస్ట్‌ సిరీస్‌లో సౌతాఫ్రికాపై భారత్‌ విజయం సాధించడం చాలా కష్టం అని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌26 నుంచి సెంచూరియన్‌ వేదికగా ప్రారంభం కానుంది. "ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలవడం చాలా కష్టం. ఇంతకు ముందు జట్టులో నోర్జే ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంటుందని చెప్పాను.

ఇప్పుడు గాయం కారణంగా నోర్జే ప్రోటాస్‌కు దూరమయ్యాడు. కనుక ఈ సిరీస్‌కు1-1తో సమం కావచ్చు. ఎందుకంటే తొలి టెస్ట్‌కు వరుణుడు  ఆటంకం కలిగించవచ్చు. ఈ సిరీస్‌ డ్రాగా ముగిస్తుందని నేను భావిస్తున్నాను. ఒక వేళ విజయం సాధిస్తే అది దక్షిణాఫ్రికా జట్టే అవుతుంది. దక్షిణాఫ్రికా జట్టు తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఆ జట్టులో యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా దక్షిణాఫ్రికా అద్బుతంగా ఆడింది" అని యూట్యూబ్‌ ఛానల్‌లో ఆకాష్‌ చోప్రా పేర్కొన్నాడు.

భారత జట్టు(అంచనా): మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్‌), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

చదవండి: SA Vs IND: భారత ఆటగాళ్లకు ద్రవిడ్‌ స్పెషల్‌ క్లాస్‌.. ఎందుకో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement