టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 603 పరుగులు చేశాడు. దీంట్లో 4 సెంచరీలు ఉండడం గమనార్హం. ఈ క్రమంలో రుత్‌రాజ్ గైక్వాడ్‌పై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో బౌలర్లను రుత్‌రాజ్ అలవోకగాఎదర్కొన్నాడు అని అతడు తెలిపాడు. అంతే కాకుండా పేస్ బౌలర్లకు అతడు స్సిప్ షాట్‌లు అద్బుతంగా ఆడుతున్నాడని చోప్రా కొనియాడాడు.
"విజయ్ హజారే ట్రోఫీలో మనం ముందుగా రుత్‌రాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుకోవాలి. అతడు ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించాడు. వరుసగా హ్యట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాకుండా అతడి వికెట్ సాధించడానికి బౌలర్లు చాలా కష్టపడుతున్నారు. అతడు ఆడిన ఇన్నింగ్స్‌లో కొన్నింటిని నేను చూశాను. రుత్‌రాజ్ చిన్న పిల్లలతో ఆడినట్లు ఆనిపించింది. ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా అద్బుతంగా స్వీప్ షాట్లను ఆడుతున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు స్వీప్ షాట్లు ఆడేది అతడు ఒక్కడే. బౌలర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ గైక్వాడ్ ఈ సీజన్‌లో అద్బుతమైన టచ్‌లో కనిపిస్తున్నాడని" అతడు యూట్యూబ్ ఛాన్‌లో పేర్కొన్నాడు. రుత్‌రాజ్ గైక్వాడ్ అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడని, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడు సెలెక్టర్ల దృష్టిలో కచ్చితంగా ఉంటడాని చోప్రా అభిప్రాయపడ్డాడు.
చదవండి: Ind Vs Sa: ఫొటోలు షేర్ చేసిన టీమిండియా ఆటగాళ్లు.. సేఫ్‌గా ఉండండి.. చలి ఎక్కువగా ఉందా భయ్యా!
Comments
Please login to add a commentAdd a comment