టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో స్టార్ ఆటగాళ్లు పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటులోఉండడం సందేహంగా మారింది. అదే విధంగా విరాట్ కోహ్లి కూడా వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కీలక ఆటగాళ్లు సిరీస్‌కు దూరం కావడంతో దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేయాలని అతడు పేర్కొన్నాడు.
రోహిత్ దూరం కావడం జట్టుకు చాలా నష్టం అని అతడు చెప్పాడు. అదే విదంగా దక్షిణాఫ్రికా పిచ్‌లు ఎక్కువగా బౌన్స్‌కు సహకరిస్తాయి, సాధరణంగా విదేశీ ఆటగాళ్లు అక్కడ పిచ్‌లపై ఆడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారాని ఆకాష్ చోప్రా తెలిపాడు. అదే విధంగా ప్రొటాస్ జట్టులో కగిసో రబాడ, నోర్జే, లూంగీ ఎంగిడీలు వంటి గన్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని అతడు చెప్పాడు. అంతేకాకుండా చాలా మంది కీలక ఆటగాళ్లు సఫారీ పర్యటనకు దూరం కావడంతో సిరీస్‌ను రద్దు చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.
"రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రాహుల్ చహార్ అందుబాటులో లేరు. గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదు నాకు తెలియదు, ఇప్పడు రోహిత్ కూడా దూరమయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటను రద్దు చేసుకుంటే బెటర్. రోహిత్ టెస్ట్‌లకు దూరం కావడం భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ. అదే విధంగా వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. టెస్ట్‌ల్లో 2021లో రోహిత్ అద్బుతంగా రాణించాడు. ఒక వేళ గాయంతో గిల్ కూడా దూరమైతే, జట్టుకు మయాంక్, రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. కానీ రాహుల్ గాయం నుంచి పూర్తిగా ఇంకా కోలుకోలేదు. ఒక వేళ అతడు కూడా గాయంతో దూరమైతే.. థర్డ్ ఓపెనర్‌గా ఎవరున్నారని?" అని యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND Vs SA: "ద్రవిడ్ సర్ నుంచి చాలా నేర్చుకున్నా... ఆయనే నా గురువు"
Comments
Please login to add a commentAdd a comment