సెమీస్కు చేరిన వెస్టిండీస్ | west indies moves into semis | Sakshi
Sakshi News home page

సెమీస్కు చేరిన వెస్టిండీస్

Published Fri, Mar 25 2016 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

సెమీస్కు చేరిన వెస్టిండీస్

సెమీస్కు చేరిన వెస్టిండీస్

నాగ్పూర్:వరల్డ్ టీ20లో మరో ఉత్కంఠ పోరుకు తెరలేచింది.  గ్రూప్-లో భాగంగా దక్షిణాఫ్రికాతో చివరి ఓవర్ వరకూ ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ మూడు వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది.  దక్షిణాఫ్రికా విసిరిన 123 పరుగుల లక్ష్యాన్ని  విండీస్ ఇంకా రెండు బంతులుండగానే ఛేదించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.  తద్వారా ఈ గ్రూప్ నుంచి సెమీస్ లోకి ప్రవేశించిన తొలి జట్టుగా విండీస్ నిలిచింది.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీ  కాక్(47; 46 బంతుల్లో  3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించక పోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా  ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(1), డు ప్లెసిస్ (9), కోల్పోరోసో(0), ఏబీ డివిలియర్స్(10), డేవిడ్ మిల్లర్(1) లు వరుసగా క్యూకట్టారు. దీంతో సఫారీలు 47 పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తరుణంలో డీ కాక్కు జతకలిసిన వైజ్(28) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా కొద్దిగా తేరుకుంది. ఇక చివర్లో క్రిస్ మోరిస్(16 నాటౌట్) తనవంతు ప్రయత్నం చేయడంతో దక్షిణాఫ్రికా సాధారణ స్కోరును మాత్రమే నమోదు చేయగల్గింది.


అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆదిలో క్రిస్ గేల్(4) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత   చార్లస్(32) , మార్లోన్ శామ్యూల్స్(44) రాణించడంతో విండీస్ విజయం దిశగా దూసుకెళ్లింది.  అయితే  100 పరుగుల వద్ద రస్సెల్(4), స్వామీ(0)లు ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో విండీస్ తడబడినట్లు కనిపించింది. ఇక చివర్లో బ్రాత్ వైట్(10 నాటౌట్;1 సిక్స్)తో రాణించడంతో విండీస్ ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement