గువాహటి: ఒక అభిమాని ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిదా అయ్యాడు. పాత సెల్‌ఫోన్లు, వైర్లతో కళాఖండాన్ని తలపించేలా విరాట్ చిత్రాన్ని రాహుల్ పరేక్ అనే అభిమాని రూపొందించాడు. ఆదివారం భారత్-శ్రీలంకల తొలిటీ20 సందర్భంగా తన అభిమాన క్రికెటర్‌కు రాహుల్ దానిని అందజేశాడు. ఆ చిత్రాన్ని చూసి విరాట్ ఎంతో సంతోషించాడు. దానిపై తన సంతకం చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘పాత ఫోన్లతో తయారు చేసిన విరాట్ కోహ్లి చిత్రం.. ఆ అభిమాని ప్రేమ ఎలా ఉంది’ అని రాసింది.(ఇక్కడ చదవండి: గువాహటి.. యూ బ్యూటీ!)
ఈ చిత్రాన్ని తయారు చేసేందుకు తనకు మూడు రోజులు పట్టినట్టు రాహుల్ పరేక్ తెలిపాడు. కాగా, అతడి ప్రతిభకు విరాట్ అచ్చెరువొంది భుజం తట్టి ప్రోత్సహించాడు. భారత్-శ్రీలంకల తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత భారీ వర్షం కురిసింది. ఆపై వర్షం వెలిసినా సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పిచ్‌ను ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టడం గ్రౌండ్‌మెన్ వల్ల కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది.(ఇక్కడ చదవండి: ఇది బీసీసీఐకే షేమ్..!)
Comments
Please login to add a commentAdd a comment