Guhawati
-
ఏనుగుకు కోపం వస్తే ఇంతే.. ట్రక్కును ఏం చేసిందో తెలుసా?
వన్య ప్రాణుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాటికి కోపం తెప్పించడం, జంతువులతో ఓవరాక్షన్ వంటివి చేస్తే వెంటనే దాడి చేస్తాయి. ఈ క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఏనుగుల విషయంలో ఇప్పటికే దాడి చేసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఏనుగులు ఎంతో ప్రశాంతతో ఉంటాయి. వాటి జోలికి వెళ్లనంత వరకు ఎవరి మీదా దాడి చేయవు. కానీ, అసోంలో మాత్రం ఓ ఏనుగు నడిరోడ్డుమీద వాహనదారులకు చుక్కలు చూపించింది. దారిలో వస్తున్న వాహనాలకు అడ్డుకుంది. వాహనదారులను భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలో ఏనుగుకు ఎదురుగా వస్తున్న మహీంద్రా బొలేరో ట్రక్కును అడ్డుకుంది. నాకే ఎదురుగా వస్తావా అని ఫీలైనట్టు ఉంది.. కోపంతో ట్రక్కును బోల్తా పడేసింది. రోడ్డు కిందకు లాగిపడేసి.. రెండుసార్లు బోల్తా కొట్టించింది. #VIDEO | An #elephant attacked and overturned a vehicle in #Guwahati. The video which is going viral on social media is said to be from Narengi Army Cantt. However, the source of the video is not known. #Assam @assamforest @cmpatowary pic.twitter.com/bzwaKQn9J6 — G Plus (@guwahatiplus) January 14, 2023 ఇదే క్రమంలో అటుగా వస్తున్న వాహనాలను సైతం అడ్డుకుంది. రోడ్డుపై వస్తున్న కార్లకు అడ్డుగా వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఎంతో సహాసం, చాకచక్యంతో ఓ కారు డ్రైవర్.. ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వామ్మో.. ఏనుగు ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #Assam: Another incident of an elephant attack came up. An elephant was spotted in the Narengi area of Guwahati. The elephant was seen angrily chasing after cars. However, people managed to safely flee the scene. pic.twitter.com/pm1brSVmNO — India Today NE (@IndiaTodayNE) January 13, 2023 -
మొదటి పదేళ్లు బదిలీ కుదరదు!
గువాహటి: ఉపాధ్యాయులు మొదటి పదేళ్లు ఒకే చోట పనిచేసేలా, ఆ తర్వాతే వారికి బదిలీ అవకాశం కల్పిం చేలా అసోం ప్రభుత్వం ఓ సరికొత్త చట్టాన్ని తీసుకురా నుంది. ఈ మేరకు బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. దీని కోసం రూపొందించిన బిల్లును ప్రస్తుతం జరుగు తున్న బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు చెప్పా రు. ‘కొన్నేళ్లుగా ఉపాధ్యాయ బదిలీలు ప్రహసనంలా మారాయి. పలుకుబడి ఉన్న కొంతమంది తమకు తెలిసిన అధికారుల ద్వారా కావాల్సిన చోటుకు బదిలీ చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేలా ఓ కొత్త చట్టాన్ని ప్రవేశపె ట్టబోతున్నాం. దీని ప్రకారం కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారు కనీసం పదేళ్ల పాటు బదిలీకి అనర్హులు. దీన్ని అతిక్రమించి అతను లేదా ఆమె బదిలీ పొందినట్లయితే వారితోపాటు, వారిని ట్రాన్స్ఫర్ చేసిన అధికారి సైతం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కనీసం మూడేళ్ల శిక్ష తప్పదు. ఒకే చోట పదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ చేసుకునేందుకు ఆన్లైన్ పద్ధతిని తీసుకొస్తున్నాం. అయితే, పరస్పర బదిలీలకు ఈ పదేళ్ల నిబంధన వర్తించదు’అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సరికొత్త చట్టానికి సభలోని అన్ని పక్షాలూ మద్దతివ్వడం గమనార్హం. -
'నన్నెవరు కొట్టలేదు..మనస్పూర్తిగా స్వాగతించారు'
-
'నన్నెవరు కొట్టలేదు..మనస్పూర్తిగా స్వాగతించారు'
గుహావటి : గత డిసెంబర్లో పార్లమెంట్లో పౌరసత్వ సవరణ చట్టం బిల్ పాస్ అయి అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రంలో శుక్రవారం పర్యటించారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను ఏమాత్రం పట్టించుకోలేదని మోదీ తెలిపారు. కొన్ని దశాబ్ధాలుగా బోడో మిలిటెంట్లతో ఈ ప్రాంతం నిరసన, హింసతో అట్టుడికిపోయేదని, కొన్ని వేలమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారని మోదీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కోక్రాఝర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ బోడో వేడుకను ఒక పండుగలా జరుపుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో అస్పాం రాష్ట్రంలో శాంతి మంత్రం కోసమే బోడో వంటి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నట్లు గుర్తుచేశారు.(నెహ్రూపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు) ప్రధాని మాట్లాడుతూ.. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్( ఎబిఎస్యూ), నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్‌డిఎఫ్‌బి), బిటిసి చీప్ హగ్రమా మొహిలరీ, అస్సాం ప్రభుత్వం బోడో ఒప్పందం సక్రమంగా జరగడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వారందరికి తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ తెలిపారు. చారిత్రాత్మకమైన బోడో ఒప్పందం ద్వారా ఇక నుంచి అస్సాం ప్రాంతం అభివృద్ధి బాటలో పయనించనుందని మోదీ వెల్లడించారు. అస్సాంలో బోడో డామినేట్ ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో జనవరి 27న కేంద్ర ప్రభుత్వంతో నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్, అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, ఇతర పౌర సమాజ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.ఈ ఒప్పందం జరిగిన రెండు రోజులకే వేల సంఖ్యలో బోడో మిలిటెంట్లు వచ్చి తమ ఆయుధాలు సరెండర్ చేశారని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలపై పట్ల గత ప్రభుత్వాల్లాగా కాకుండా తమ ప్రభుత్వం ఎంతో ప్రేమ చూపుతోందన్నారు. ఒకప్పుడు కేంద్రం ఎలాంటి నిధులు ఇస్తుందోనని ఈశాన్య రాష్ట్రాలు ఎదురుచూసేవని... కానీ ఇప్పుడు అవే ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధిలో కీలకంగా మారాయని మోదీ తెలిపారు. చారిత్రాత్మక బోడో ఒప్పందం ద్వారా ఇకపై ఈ ప్రాంతంలో హింసకు తావు లేకుండా శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు తర్వాత తాను ఈశాన్య రాష్ట్రంలో అడుగుపెడితే కర్రలతో తనను తరిమి కొడతారని కొందరు వాఖ్యానించినట్లు మోదీ పేర్కొన్నారు. ' ఈరోజు నేను ఈశాన్య రాష్ట్రంలో అడగుపెట్టాను. ఏ ఒక్కరు నాపై కర్రలతో దాడి చేయకపోగా నన్ను సాధరంగా ఆహ్వానించారు. నా వెనుక వేల సంఖ్యలో అక్కా, చెల్లెమ్మల ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవరు తరిమికొట్టలేరని ప్రధాని మోదీ రాహుల్ గాంధీని ఉద్ధేశించి ట్విటర్ వేదికగా పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు. PM Modi in Kokrajhar, Assam: Kabhi kabhi log danda marne ki baatein karte hain. Lekin jis Modi ko itne badi matra mein mata aur beheno ka suraksha kawach mila ho us par kitne bhi dande gir jaye, usko kuch nahi hota. pic.twitter.com/yo7wjU14tP — ANI (@ANI) February 7, 2020 -
ఆ గిఫ్ట్‌ను చూసి కోహ్లి ఫిదా..!
గువాహటి: ఒక అభిమాని ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిదా అయ్యాడు. పాత సెల్ఫోన్లు, వైర్లతో కళాఖండాన్ని తలపించేలా విరాట్ చిత్రాన్ని రాహుల్ పరేక్ అనే అభిమాని రూపొందించాడు. ఆదివారం భారత్-శ్రీలంకల తొలిటీ20 సందర్భంగా తన అభిమాన క్రికెటర్‌కు రాహుల్ దానిని అందజేశాడు. ఆ చిత్రాన్ని చూసి విరాట్ ఎంతో సంతోషించాడు. దానిపై తన సంతకం చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘పాత ఫోన్లతో తయారు చేసిన విరాట్ కోహ్లి చిత్రం.. ఆ అభిమాని ప్రేమ ఎలా ఉంది’ అని రాసింది.(ఇక్కడ చదవండి: గువాహటి.. యూ బ్యూటీ!) ఈ చిత్రాన్ని తయారు చేసేందుకు తనకు మూడు రోజులు పట్టినట్టు రాహుల్ పరేక్ తెలిపాడు. కాగా, అతడి ప్రతిభకు విరాట్ అచ్చెరువొంది భుజం తట్టి ప్రోత్సహించాడు. భారత్-శ్రీలంకల తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత భారీ వర్షం కురిసింది. ఆపై వర్షం వెలిసినా సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పిచ్‌ను ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టడం గ్రౌండ్‌మెన్ వల్ల కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది.(ఇక్కడ చదవండి: ఇది బీసీసీఐకే షేమ్..!) -
ఇది బీసీసీఐకే షేమ్..!
గువాహటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యింది అనే కంటే అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) వద్ద సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగానే మ్యాచ్ జరగలేదంటేనే బాగుంటుందేమో. వర్షం వెలిసిన తర్వాత పిచ్ ఆరబెట్టడానికి సదరు అసోసియేషన్ హెయిర్ డ్రయర్స్, ఐరన్ బాక్స్‌లు ఉపయోగించడమే ఇందుకు కారణం. ఇది ఏకంగా అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా చెప్పబడుతున్న బీసీసీఐకే మచ్చతెచ్చే విషయం. ఒక అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ తరహా విధానాన్ని అవలంభించడమే విమర్శలకు దారి తీసింది. (ఇక్కడ చదవండి: మెరుపుల్లేవ్... చినుకులే!) మ్యాచ్ రద్దయిన తర్వాత ఏసీఏ అవలంభించిన తీరుపైనే కాకుండా బీసీసీఐనే ఆడుసుకుంటున్నారు నెటిజన్లు. ‘ 1980 కాదురా నాయనా.. 2020. ఏకంగా ఫ్లైయింగ్ కార్స్‌ని వాడతారనుకుంటే, మరి ఏమిటో మనం వెనక్కి పయనిస్తున్నాం. ఇది బీసీసీఐకే షేమ్’ అని ఒక నెటిజన్ ఎద్దేవా చేయగా, ‘ శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో ఉపయోగించే వర్షపు కవర్లను తెచ్చుకుని ఉండాల్సింది’ అని మరొకరు విమర్శించారు. ఒక మహిళ చికెన్‌ను రోస్ట్ చేయడానికి హెయిర్ డ్రయర్‌ను ఉపయోగిస్తున్న ఇమేజ్ను పోస్ట్ చేసి మరీ మరొక అభిమాని సెటైర్ వేశాడు. ‘ ఇది ఇండియన్ పవర్ఫుల్ హెయిర్ డ్రయర్’ అని మరొకరు చమత్కరించారు. ‘ పిచ్‌ను హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టారు.. ఇక పిచ్‌ను చదును చేసే క్రమంలో మన తలలతో చేస్తే బాగుంటుందేమో’ అని మరో అభిమాని విమర్శించాడు. -
పడుచు పిల్లలా చిందేసిన బామ్మ
-
అల్‌ఖైదా, ఐఎస్ తీవ్రవాదం అత్యంత ప్రమాదకరం
గౌహతి: దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శనివారం అసోం రాజధాని గౌహతిలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐబీ అధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్‌నాథ్ .... దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ ... అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం అత్యంత ప్రమాదకరమైనవని అన్నారు. ఉగ్రవాదం చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని... ఈ అంశాన్ని చిన్నదిగా చూడబోమని తెలిపారు. దేశ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచూ ఉల్లంఘించడమే కాకుండా.... పలు దురాగతాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దేశ సరిహద్దుల్లోని ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని రాజ్‌నాధ్ భరోసా ఇచ్చారు. 2019 నాటికి దేశంలోని అన్ని జాతీయ రహదారులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన మొదటి దశ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని గుర్తు చేశారు. ఆ రాష్ట్రంలో ఇంతలా ఓటింగ్ జరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇంత ఓటింగ్ జరగడం గతంలో తాను ఎన్నడూ చూడలేదన్నారు. అదికాక ఆ ఎన్నికలు ప్రశాంతగా జరిగాయని చెప్పారు. దేశ తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను మరింత పెంచాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. దేశ విపత్తు సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఏఎంలదీ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆ సంస్థల సేవలను రాజ్‌నాథ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.