ఏనుగుకు కోపం వస్తే ఇంతే.. ట్రక్కును ఏం చేసిందో తెలుసా? | Enraged Elephant Flips Over Car In Assam Guwahati Video Viral | Sakshi
Sakshi News home page

ఏనుగుకు కోపం వస్తే ఇంతే.. ట్రక్కును ఏం చేసిందో తెలుసా?

Published Mon, Jan 16 2023 4:57 PM | Last Updated on Mon, Jan 16 2023 5:05 PM

Enraged Elephant Flips Over Car In Assam Guwahati Video Viral - Sakshi

వన్య ప్రాణుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాటికి కోపం తెప్పించడం, జంతువులతో ఓవరాక్షన్‌ వంటివి చేస్తే వెంటనే దాడి చేస్తాయి. ఈ క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఏనుగుల విషయంలో ఇప్పటికే దాడి చేసిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఏనుగులు ఎంతో ప్రశాంతతో ఉంటాయి. వాటి జోలికి వెళ్లనంత వరకు ఎవరి మీదా దాడి చేయవు. కానీ, అసోంలో మాత్రం ఓ ఏనుగు నడిరోడ్డుమీద వాహనదారులకు చుక్కలు చూపించింది. దారిలో వస్తున్న వాహనాలకు అడ్డుకుంది. వాహనదారులను భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలో ఏనుగుకు ఎదురుగా వస్తున్న మహీంద్రా బొలేరో ట్రక్కును అడ్డుకుంది. నాకే ఎదురుగా వస్తావా అని ఫీలైనట్టు ఉంది.. కోపంతో ట్రక్కును బోల్తా పడేసింది. రోడ్డు కిందకు లాగిపడేసి.. రెండుసార్లు బోల్తా కొట్టించింది. 

ఇదే క్రమంలో అటుగా వస్తున్న వాహనాలను సైతం అడ్డుకుంది. రోడ్డుపై వస్తున్న కార్లకు అడ్డుగా వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఎంతో సహాసం, చాకచక్యంతో ఓ కారు డ్రైవర్‌.. ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వామ్మో.. ఏనుగు ఏంటి ఎలా బిహేవ్‌ చేస్తుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement