పుణె: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. కొన్నాళ్లుగా ఒకవైపు గాయాలు, మరొకవైపు ఫామ్ లేమితో సతమవుతున్న ధావన్ బ్యాట్ విదిల్చాడు. శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ అర్థ శతకం నమోదు చేశాడు. ఇది ధావన్‌కు 15 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ. 2018, నవంబర్ నెలలో చివరిసారి టీ20 హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత ధావన్‌కు ఇదే తొలి అర్థ శతకం.
శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ బ్యాటింగ్‌ను ధావన్-కేఎల్ రాహుల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్ చెలరేగి ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్. కాగా, ధావన్ 52 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సందకాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి ధావన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సంజూ సామ్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్స్ కొట్టాడు. అయితే తన ఆడిన రెండో బంతికి సామ్సన్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇక రాహుల్(54) హాఫ్ సెంచరీ సాధించి మూడో వికెట్‌గా ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!)
Comments
Please login to add a commentAdd a comment