
ఇండోర్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ గురించి క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. కాస్త వైవిధ్యంగా ఉండే హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను ఇప్పటివరకూ ఎవరూ అనుకరించిన దాఖలాలు లేవు. అయితే భజ్జీ యాక్షన్‌ను అచ్చం దించేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అప్పుడప్పుడు సరదాగా మిగతా క్రికెటర్ల శైలిని కాపీ చేసి నవ్వులు పూయించే కోహ్లి.. ఈసారి హర్భజన్‌ను ఎంచుకున్నాడు.
శ్రీలంకతో రెండో టీ20కి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో భజ్జీని మళ్లీ గుర్తు చేశాడు కోహ్లి. భజ్జీ శైలితో బౌలింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో కోహ్లి తన నవ్వును ఆపుకోలేకపోయాడు. అసలు ఈ యాక్షన్‌తో బౌలింగ్ సాధ్యమేనా అనే విధంగా కోహ్లి పగలబడి మరీ నవ్వుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment